![]() |
![]() |

'కార్తీక దీపం' సీరియల్ ఇప్పుడు చాలా ఆసక్తికరంగా మారింది. అయితే శనివారం జరిగిన ఎపిసోడ్-1556 లో శౌర్య, హిమలు హేమచంద్రకి కనపిస్తారు. వాళ్ళతో మాట్లాడి వాళ్ళని తీసుకొని వెళ్తాడు.
తరువాత చారుశీల దగ్గరికి కోపంతో వస్తాడు కార్తీక్. "నువ్వు ఎంత మోసం చేసావ్. నువ్వు మోనిత పంపిన కీలుబొమ్మవి. మా విషయాలు అన్ని కూడా మోనితకి చేరవేశావు" అని అంటుంది. చారుశీల మాట్లాడుతూ "నేను మిమ్మల్ని మోసం చెయ్యలేదు. మిమ్మల్ని ఎప్పుడైనా ఇబ్బంది పెట్టానా, బాగానే చూసుకున్నా కదా" అని చారుశీల చెప్తుంది. "ఇంకా నమ్మించాలని చూడకు" అని అంటాడు. అంతలోపే చారుశీలను పిలుస్తుంది మోనిత. అది విన్న కార్తిక్ "ఓహో మోనిత ఇక్కడే ఉందా.. దానితోనే తేల్చుకుంటా" అని మోనిత దగ్గరికి వెళ్తాడు.
కోపంగా వెళ్ళిన కార్తిక్ ని పట్టించుకోకుండా "ఈ బట్టలన్నీ కూడా మన పెళ్లికి, ఇంకా ఇవేమో హనీమూన్ కి. మనం హనీమూన్ కి స్విట్జర్లాండ్ వెళ్దాం. ఇదిగో టికెట్స్" అని చూపిస్తుంది. దాంతో కార్తీక్ కోపంతో మోనిత మీదకి చెయ్యి లేపుతాడు. అప్పుడే దీప కూడా అక్కడికి వస్తుంది.
అప్పుడే వచ్చిన దీపని చూసి మోనిత "చూడు దీప.. కార్తీక్ నా వాడు. నువ్వు పోయాక మా పెళ్లి. ఇదిగో హనీ మూన్ టికెట్స్. నువ్వు ఇంకో వారం బ్రతుకుతావు. ఆ తర్వాత ఖేల్ ఖతం.. దుకాణం బంద్" అని అంటుంది. ఆ తర్వాత దీప మోనితల మధ్యలో మాటల యుద్ధం జరుగుతుంది. దీప కార్తీక్ లు అక్కడి నుండి వెళ్తారు.
ఆ తరువాత మోనిత హ్యాపీగా కార్తీక్ గురించి కలలు కంటుంది. అప్పుడే చారుశీల వస్తుంది. మోనిత మాట్లాడుతూ "దీప వెళ్ళాక కార్తీక్ నా సొంతం" అని అంటుంది. "కార్తీక్ నీ దగ్గరికి రావడానికి.. నీ మీద ఏమైనా మంచి అభిప్రాయం ఉందా" అని చారుశీల అడుగుతుంది. మోనిత మాట్లాడుతూ "కార్తీక్ ని.. నా సొంతం చేసుకోవడానికి జైలులో అద్భుతమైన పథకాలు రచించాను. అది తర్వాత చెప్తాలే గాని.. కార్తీక్, దీపలు ఏమంటున్నారు. అది చెప్పు" అని అడుగుతుంది. "ఏమంటారు.. నీకు మోనితకి తేడా లేదని, నిన్ను నన్ను కలిపేశారు. ఇంప్రెషన్ మొత్తం పోయింది" అని అంటుంది చారుశీల. "నీ మీద ఇంప్రెషన్ ఎలా ఉంటే ఏంటీ.. నువ్వు ఏమైనా కార్తీక్ ని ట్రై చేస్తున్నావా" అని అడుగుతుంది. "అదేం లేదు" అని చారుశీల అంటుంది. "అయితే సరే మరి" అని ఇంకా కొన్ని జాగ్రత్తలు చెప్తుంది మోనిత. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |